mt_logo

నీటి సమస్యలని తీర్చే చేతకాక లోటు వర్షపాతం అని మాట్లాడడం విడ్డూరం: కేటీఆర్

నీటి సమస్యలను తీర్చలేకే సీఎం రేవంత్ రెడ్డి లోటు వర్షపాతం అని మాట్లాడుతున్నాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

ఐఎండీ లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణానికంటే 14% ఎక్కువ వర్షపాతం తెలంగాణలో నమోదు అయ్యిందని.. నీటి సమస్యలని తీర్చే చేవలేక, చేతకాక.. లోటు వర్షపాతం అని మాట్లాడడం విడ్డూరం అని కేటీఆర్ పేర్కొన్నారు.

అబద్ధాలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు సత్యదూరపు మాటలు మాట్లాడుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత వారి ప్రవర్తన చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకొంటున్నారు అని అన్నారు.

రైతు సమస్యలు తీర్చడం మాట అటుంచి, తెలంగాణ రైతాంగానికి మూడు నెలల్లోనే స్కాంగ్రెస్ చేతగానితనం పూర్తిగా అర్థమయ్యింది అని కేటీఆర్ తెలిపారు.