ప్రముఖ రచయిత దాశరథి కృష్ణామాచార్యులు జయంతి సందర్భంగా వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్మరించుకున్నారు.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహనీయులు, సాహితీవేత్త దాశరథి కృష్ణామాచార్యుల వారి శత జయంతి నేడు. పద్యాన్ని ఆయుధంగా మలిచి పీడిత ప్రజల పక్షాన పోరాడిన యోధుడు దాశరథి.. తన రచనలతో తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచి తెలంగాణ బిడ్డల్లో ఉద్యమస్ఫూర్తిని నింపిన మహాకవి అని కొనియాడారు.
సాహితీ రంగంలో చెరగని ముద్రవేసిన దాశరథి గారు కథలు, నాటికలు, కవితలు, సినిమా పాటలు వంటి ఎన్నో రచనలు చేసి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా గెలుచుకున్నారు అని కేటీఆర్ అన్నారు.
తాను చేసిన సేవలకు సముచిత గౌరవాన్నిస్తూ సాహితీ రంగంలో విశేష కృషి చేసిన వారికి దాశరథి సాహితీ పురస్కారాన్ని అందచేయడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ గారు ప్రారంభించారు.. ప్రతి సంవత్సరం దాశరథి జయంతిని అధికారికంగా నిర్వహించారు అని గుర్తుచేశారు.