mt_logo

రుణమాఫీకి పావు వంతు రైతులే అర్హులా?: కేటీఆర్

రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తుంది అని విమర్శించారు.

రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ. 7,000 కోట్లు రుణమాఫీకి దారి మళ్లింపు చేశారని ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంత మొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తరు? 2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా? 2014 లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ. 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చింది అని కేటీఆర్ అన్నారు.

2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ. 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు. కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ. 2 లక్షల వరకు ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలి. అర్హులైన అందరు రైతులకూ రైతుబంధు విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.