mt_logo

పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి కేటీఆర్

పోడు భూములపై అవగాహన కోసం సిరిసిల్ల కలెక్టరేట్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 8 వేల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని తెలిపారు. ఆక్రమణకు గురైన 67 గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించి పోడు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నవంబర్ 8 నుంచి గ్రామాల వారిగా ఈ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న పోడు రైతుల అర్జీలని పరిశీలిస్తామని, భవిష్యత్‌లో అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా.. ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వానికి రెండో ఎజెండా ఏమీ లేదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *