mt_logo

కాంగ్రెస్ వస్తే మళ్ళీ చీకటి రోజులే: మంత్రి కేటీఆర్

సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌లో బీఆర్ఎస్ యువజన గర్జనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దుబ్బాక బీఅర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రఘునందన్ రావు అనేక లుచ్చా మాటలు చెప్పిండు. ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదని ఆరోపించారు. ఆరోజు చెప్పిన లుచ్చా మాటలు మళ్ళీ చెబుతుండని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్క సారి గుర్తు చేసుకోండని అన్నారు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు, ఎరువుల కొరతలు. కరెంట్ ఎక్కడ ఉందో చూపాలని రేవంత్, కోమటిరెడ్డి అంటున్నారు. దుబ్బాకకు వచ్చి కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుంది కరెంట్ వస్తుందో, లేదో అని చురకలంటించారు. 

ఒక్క ఛాన్స్ అంటున్న కాంగ్రెసోళ్లకు సిగ్గు ఉండాలని అన్నారు. ఎద్దు తెలువదు, ఎవుసం తెలవని సన్నాసులు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. ఉత్తం కుమార్ రెడ్డి. రైతు బంధు దుబారా అంటున్నాడు. కాంగ్రెస్ కొత్త సరుకు కాదు.. కొత్త సీసాలో పాత సరుకని ఎద్దేవా చేసారు. ఇక బీజేపీ నుంచి మీ దగ్గర ఓర్రుబోతు ఉన్నడు. మాటలు తప్ప చేతలు లేవని స్పష్టం చేసారు.

కాంగ్రెస్ వస్తే మళ్ళీ చీకటి రోజులే వస్తాయని హెచ్చరించారు. దుబ్బాకలో గత ఉప ఎన్నికల్లో  చేసిన తప్పు  ప్రజలు మళ్ళీ చేస్తే.. దుబ్బాక చాలా నష్ట పోతుందని వివరించారు. దుబ్బాకలో ప్రభాకర్ అన్నను గెలిపిస్తే కేసీఆర్ నేను హరీషన్న కలిసి అన్ని అన్ని విధాలుగా అభివృద్ధిచేస్తాం అని హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి మాయమాటలకు మోసపోకండని సూచించారు.