mt_logo

కేటీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్..

సిరిసిల్ల ఎమ్మెల్యే,  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 27 నుండి ఏప్రిల్ 9 వ తేదీ వరకు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. కరీంనగర్, నల్గొండ, చేవెళ్ళ, మల్కాజిగిరి, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గాల్లో కేటీఆర్ విస్తృతంగా పర్యటించనున్నారు.

మార్చి 27న రాజన్న సిరిసిల్లలోని ముస్తాబాద్ మండలంలో, మార్చి 29న ఎల్లారెడ్డిపేట, వీర్నవల్లి మండలాలతో పాటు కరీంనగర్ పట్టణంలో రోడ్ షో నిర్వహించనున్నారు. మార్చి 30న నర్సంపేట, ములుగులో బహిరంగసభలు, అదేరోజు తాండూరు, వికారాబాద్ లో కూడా పర్యటిస్తారు. మార్చి 31న రాజన్న సిరిసిల్లలోని గంభీరావు పేట మండలం, వికారాబాద్ జిల్లాలోని పరిగి, చేవెళ్ళలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన ఎల్బీ నగర్, మహేశ్వరం లలో రోడ్ షోలు, ఏప్రిల్ 2న సిరిసిల్ల రూరల్, ఉప్పల్, మల్కాజిగిరిలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 3న హుజూర్ నగర్ లో నిర్వహించే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొననున్నారు. అదేరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్ లో రోడ్ షోలో పాల్గొంటారు.

ఏప్రిల్ 4న ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభ, అంబర్ పేట, ముషీరాబాద్ లో రోడ్ షోలు ఉంటాయి. ఏప్రిల్ 5న కోదాడలో బహిరంగ సభ, సికింద్రాబాద్, సనత్ నగర్ లలో రోడ్ షోలు, ఏప్రిల్ 6వ తేదీన జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్ లలో సభలతో పాటు, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసే రోడ్ షోల్లో పాల్గొంటారు. 8న ఇల్లెందు, పినపాకలో బహిరంగ సభలు, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ లో రోడ్ షోలు ఉంటాయి. ఏప్రిల్ 9న నల్లగొండలో జరిగే రోడ్ షోలో కేటీఆర్ పాల్గొననున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *