ఆదివాసీల జానపద గుస్సాడి నృత్యానికి వన్నె తెచ్చిన గుస్సాడి కనకరాజు గారి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కనకరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఆసిఫాబాద్ జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు గారు ఆదివాసీల గుస్సాడి నృత్యానికి దేశవ్యాప్త ప్రఖ్యాతి తీసుకువచ్చారని, ఎర్రకోటపైన కూడా తన నృత్యాన్ని ప్రదర్శించారని కేటీఆర్ గుర్తు చేశారు. గుస్సాడి నృత్యానికి తన జీవితాన్ని అంకితం చేశారని కేటీఆర్ కొనియాడారు.
ఆదివాసీల కళకు ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకుందని తెలియజేసిన కేటీఆర్.. ఆయన సేవలను స్మరించుకున్నారు