రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సైలెంట్ ఓటింగ్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మేమే గెలుస్తున్నామని అన్నారు. ములుగు, గోశామహల్, హుజురాబాద్,ఖమ్మంలో కూడా కొన్ని గెలుస్తున్నామన్నారు. రాజసింగ్ ది లోద్ కమ్యూనిటీ. లోద్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మాతో మాట్లాడారు మాతోనే ఉంటామన్నారని తెలిపారు. మార్వాడి కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మాట్లాడారు మాకు మద్దతు తెలిపారు.
కాంగ్రెస్ ఆఫీస్‌లో తయారైన సర్వేలు చూస్తే అలాగే ఉంటాయి. సీ ఓటర్ సర్వే 2018 లో చెప్పింది, ఇప్పుడు చెబుతుంది పప్పులో కాలేసింది మాకు శుభసూచకం అన్నారు. కొడంగల్‌లో బీఆర్ఎస్ గెలుస్తుంది. కామారెడ్డిలో కేసీఆర్ గెలుస్తున్నారు. రేవంత్ రెండు చోట్లా ఓడిపోతున్నాడని తెలిపారు.
సిరిసిల్లలో చాలా టఫ్ ఉంది అని కాంగ్రెస్ సర్వే లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. 51 శాతం ఓట్లు చాలు అధికారానికి, చాలా ప్రాంతాల్లో బీజేపీ కాంగ్రెస్ పరస్పరం సహకరించుకుంటున్నాయి. రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయన్నారు. రాహుల్ గాంధీ ఎందుకు గోషామహల్‌లో ప్రచారం చేయలేదు. కరీంనగర్, కోరుట్లలో రాహుల్,రేవంత్ ప్రచారం చేయలేదు. ప్రధాని మోదీ చేసిన ప్రచారం అంతా పార్లమెంట్ ఎన్నికల కోసమే అని స్పష్టం చేసారు.
బీజేపీకి లాస్ట్ టైం 108 సీట్లలో డిపాజిట్ రాలేదని తెలిపారు. హైద్రాబాద్‌లో బీఆర్ఎస్ వేవ్ ఉందని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డిలో రెండు మూడు చోట్ల గట్టి పోటీ ఉంటుందన్నారు. పొలిటికల్ టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారు ..చివరి వరకు ఉండేది కేసీఆర్ మాత్రమే అని తేల్చి చెప్పారు.
గులుగుడు గులుగుడే ..గుద్దు డు గుద్దుడే అన్నారు. మెదక్‌లో 10 లో 9 సీట్లు గెలుస్తున్నాం అన్నారు. రైతు బంధు పై కాంగ్రెస్ నేత ఉత్తమ్ ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేసారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చి 5 గంటల కరెంటు ఇస్తామన్నారు. దాంతో తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యింది….కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని అన్నారు. కాంగ్రెస్‌కు పవరిస్తే, జనాలకు కరెంట్ కట్ చేస్తారని స్పష్టం చేసారు.
అశోక్ నగర్ వెళ్లి, బావార్చిలో బిర్యానీ తిని టైం పాస్ చేసిన రాహుల్ ..మేమిచ్చినన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రం లో ఇచ్చింది చెప్పలేదు…చర్చకు రాలేదు. కేసీఆర్ పై ప్రజలకు క్రెడిబిలిటీ ఉందని అన్నారు. కేసీఆర్ చెప్పినవి 90 శాతం చేశారు ..చెప్పనివి కూడా చేశారు. నువ్వు ముఖ్యమంత్రి ఎట్లవుతావు అంటే గుంపు మేస్త్రి అంటుండు… ఇట్లాంటి బేవకూఫ్ గాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారంట అని ఎద్దేవా చేసారు.
కరోనా అనేది తెలవకుండా వస్తుంది… తెలిసి తెచ్చుకుందాం అనుకుంటే అది కాంగ్రెస్ వైరస్ అవుతుందన్నారు. కరోనాకు వ్యాక్సిన్ ఉంది, కాంగ్రెస్‌కు వ్యాక్సిన్ లేదన్నారు. రైతుబంధు విషయంలో హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని అడిగారు. టీ హబ్ విషయంలో నాకు వ్యక్తిగతంగా నోటీసు ఇచ్చారు. అలాగే రైతు బంధు విషయంలో హరీష్ రావు తప్పు చేస్తే హరీష్‌కి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలన్నారు. కానీ రైతు బంధు ఆపడం ఏంటి? అని అడిగారు. పీఎం కిసాన్‌కు లేని ఆంక్షలు రైతు బందుపై ఎందుకు? అని ప్రశ్నించారు. దీక్ష దివస్ రోజు నేను ఒక రోజు జైల్లో ఉన్నానని పేర్కొన్నారు.