మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో రైతు ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మానం, సిగ్గు, శరం ఉన్నోన్నికి మనం మర్యాద ఇవ్వాలె. ఈ ముఖ్యమంత్రికి అలాంటివి ఏమీ లేవు అని ధ్వజమెత్తారు.
కేసీఆర్ రుణమాఫీ చేసిన వాళ్లు కూడా రుణం తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి అన్నాడు. డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి పది నెలలు అయిపోయింది. మొదటి రోజు సంతకం అన్నాడు. పది నెలలు అయినప్పటికీ ఇప్పటికీ రుణమాఫీ లేదు అని విమర్శించారు.
సెక్రటరియేట్‌లో లంక బిందెలు అంటాడు. లంక బిందెల కోసం దొంగలు కదా తిరిగేదీ? ఏడ దేవుడు కనిపిస్తే ఆ దేవుళ్ల మీద ఒట్లు వేసిండు. ప్రజలు మోసపోయే వాళ్లనే నమ్ముతారని ముందే చెప్పిండు. చిట్టి నాయుడు కట్టేటోడు కాదు.. కూలగొట్టేటోడు అని మండిపడ్డారు.
బోనస్ పేరుతో రూ. 500 ఇస్తా అన్నాడు. రైతు భరోసా ఏటా రూ. 15 వేలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు రైతుబంధు లేదు, రైతు భరోసా లేకుండా పోయింది. అటు కాకుండా, ఇటు కాకుండా ఎటు కాకుండా పోయింది. రాష్ట్రంలో అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశాడు అని అన్నారు.
పెద్ద మనుషులు, మహిళలకు ఫించన్లు అన్నాడు. బతుకమ్మ చీరలు వచ్చినయా? పండుగ పండుగలా ఉన్నదా? ఇందిరమ్మ ఇళ్లు కడుతా అంటే ఓట్లు వేసిన్రు. ఇళ్లు కూలగొడుతా అంటే ఓట్లు వేయలేదు. పది నెలల్లో ఒక్క మంచి పనైనా చేశారా ప్రజలకు మేలు చేసే పనులు చేశారా అని ప్రశ్నించారు.
రుణమాఫీ చేసేందుకు పైసల్లేవంట. కానీ రూ. లక్షా 50 వేల కోట్లు మాత్రం మూసీలో పోస్తడంట. ప్రజలకు పథకాలు, మంచి చేస్తే కమీషన్లు రావు మూసీ ప్రాజెక్ట్ అయితే రూ. 25 నుంచి 30 వేల కోట్లు దోచుకోవచ్చు. మూసీ ప్రక్షాళన అనేది కేవలం పైసలు దొబ్బేందుకే. బ్యూటీఫికేషన్ కాదు లూటీఫికేషన్ మాత్రమే అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
పేదోళ్లను కొట్టి పార్టీ పెద్దలకు కమీషన్లు పంపి సీటు కాపాడుకోవటం కోసమే మూసీ ప్రాజెక్ట్. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేస్తామంటూ ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు చెప్పారు. మీకు ఎవరికైనా భూములు తిరిగి ఇచ్చారా. ఫ్యూచర్ సిటీ అంట. ఉన్న సిటీని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడుతాడంట అని ఎద్దేవా చేశారు.
ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి మనం కేంద్రం వాటాతో చేయాలని ప్రయత్నించాం. కానీ ఆర్ఆర్ఆర్ సౌత్ భాగాన్ని రాష్ట్రమే చేస్తదంట. ఎందుకంటే కాంట్రాక్ట్‌ల పేరుతో భారీగా డబ్బులు దోచుకునే ప్రయత్నం. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఆస్మదీయులకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకే.. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా పనిచేస్తున్నాడు తప్ప.. ముఖ్యమంత్రిలా పనిచేయటం లేదు అని ఆరోపించారు.
మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి, మంత్రుల మెదళ్లలోన ఉంది. ముఖ్యమంత్రి, మంత్రుల గబ్బు మాటలను ఇక వదిలేది లేదు నా మీద అడ్డగోలు మాట్లాడిన మంత్రిని వదిలిపెట్ట. క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తా. ముఖ్యమంత్రి మీద కూడా పరువు నష్టం దావా వేస్తా అని పేర్కొన్నారు.
గతంలో అపొజిషన్‌లో ఉన్నారని ఏదైనా మాట్లాడిన వదిలేశాం. ఇక వదిలేది లేదు. తప్పు చేయకుండా పిచ్చి మాటలు మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. మోడీనే ఏం చేసుకుంటావో చేసుకో అన్నోళ్లం. ఈ చిట్టి నాయుడు ఎంత అని దుయ్యబట్టారు.
సబితా ఇంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్‌లు ఎక్కడ ఉన్నాయో చెప్పు. మేమే కూలగొడుతాం. మా ఇళ్లను కూలగొడితే నీ కడుపు సల్ల పడుతదంటే వాటిని కూల్చు. కానీ పేదల ఇళ్లను వదిలెయ్. మూసీ బాధితుల గోస చూస్తుంటే బాధ అనిపిస్తోంది. మీరే వాళ్లకు పర్మిషన్ ఇస్తిరి. 50 ఏళ్లు వాళ్ల కట్టిన ట్యాక్స్‌లు దొబ్బి తిని పేదవాళ్లను పట్టుకొని కబ్జాదారులు అంటున్నాడు ముందు రెడ్డి కుంటలో నీ ఇళ్లును, నీ అన్న ఇళ్లును కూల్చు అని సవాల్ విసిరారు.
నీకు పైసలు కావాలె. రాహుల్ గాంధీకి పంపించాలె. మాకు నీ బాధ అర్థమైంది. నీ సీటు కాపాడుకోవాలె. నీకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చందాలు ఇస్తాం. కానీ పేదల ఇళ్లను మాత్రం కూలగొట్టకు. ప్రజలు ఇచ్చిన చందాలు తీసుకెళ్లి నీ సీటు కాపాడుకో. ఎన్నికల నాటికి ప్రజలు అన్ని మర్చిపోతారు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. వంద రోజుల్లో చేస్తా అని చేయని దానికి మొత్తం రాసి పెట్టుకోండి. దానికి మిత్తితో సహా ఇచ్చేలా మనం డిమాండ్ చేయాలె అని కేటీఆర్ అన్నారు.
బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. ఒక్క చీర కాదు, రెండు చీరలు ఇస్తా అన్నాడు. ఉన్న చీరలు కూడా ఇవ్వలేదు. కనీసం బతుకమ్మ పండుగ నిర్వహించేందుకు పైసలు కూడా ఇస్తలేడు. అసెంబ్లీలో సబితక్క సహా మా మహిళ ఎమ్మెల్యేలు నాలుగు గంటలు నిలబడితే కనీసం మైక్ ఇవ్వలేదు. ఆడబిడ్డలపై కనీసం కనికరం కూడా చూపించలేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదని సబితక్క అన్నారు. ఈ మనిషిది రాతి గుండె అని మండిపడ్డారు.
ఈ ముఖ్యమంత్రిని ఒక పెద్దమ్మ తిట్టిన తిట్లు చూసిన తర్వాత ఇదేం జన్మరా అనిపించింది.. ముఖ్యమంత్రిని తిట్టిన తిట్లు వింటే వేరే ఎవరైనా సరే ఎక్కడన్న పడి చస్తుండే. ముఖ్యమంత్రికి ఏ బాషలో చెబితే అర్థమవుతదో.. ప్రజలు కూడా అదే బాషలో చెబుతున్నారు. సామాన్యులను ఎక్కువ కాలం మోసం చేయలేవు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు అని అన్నారు.
రుణమాఫీ అందరికీ అయ్యిందంటే మీ సొంత ఊళ్లో అడుగుదామంటే సప్పుడు చేయలే..రుణమాఫీ ముందు రూ. 48 వేల కోట్లు అన్నాడు. కేబినెట్‌లో రూ. 31 వేల కోట్లు అన్నాడు. బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు పెట్టిండు..ఆ తర్వాత రూ. 18 వేల కోట్లు అన్నాడు. వాళ్ల ఉప ముఖ్యమంత్రే రూ. 7, 500 కోట్లు రుణం మాఫీ చేశాం అన్నాడు..ఎక్కడ రూ. 41 వేల కోట్లు.. ఎక్కడి రూ. 7500 కోట్లు. చారాణ రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నారు అని విమర్శించారు.
ముఖ్యమంత్రి గారు ఇక రాష్ట్రంలో మీరు తిరిగే పరిస్థితి లేకుండా పోతోంది. కందుకూరు మీద కేసీఆర్ గారికి ప్రేమ ఉంది. అందుకే ఇక్కడ నుంచి మెట్రో పోనిస్తడ అన్నాడు. ఈ నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ సాంక్షన్ చేశాడు. కానీ రేవంత్ రెడ్డి వాటిని రద్దు చేశాడు. మా కన్నా ఎక్కువ మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకోవాలి అని కోరారు.
నా కడుపు, నా ఢిల్లీ నాయకుల కడుపు నిండాలంటే ప్రజలు తిరగబడే రోజు వస్తది..రైతులు రుణమాఫీ అడిగితే మీ మంత్రులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మీ చిల్లర మాటలు చూసిన తర్వాత రైతులు తిరగబడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కందుకూరులో మొదలైన రైతుధర్నా కార్యక్రమం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది అని జోస్యం చెప్పారు.
రైతులకిచ్చిన హామీల విషయంలో నిరంతరం ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలి..ఆరోగ్యం బాగాలేకపోయిన సరే రైతుల కోసం ఇక్కడి రావటం జరిగింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు ఇతర అవసరాలకు వాడరాదు. ఏడేళ్ల పాటు కష్టపడి ఫార్మాసిటీ కోసం రైతుల దగ్గర నుంచి మేము 14 వేల ఎకరాలు సేకరించాం. ఫోర్త్ సిటీ కోసం ఒక్క ఎకరా కూడా సేకరించలేదు. ఫార్మాసిటీ భూములనే ఫోర్త్ సిటీ కోసం వాడే ప్రయత్నం చేస్తున్నారు అని పేర్కొన్నారు.
అది ఫోర్త్ సిటీ కాదు. రేవంత్ రెడ్డి ఫోర్ బ్రదర్స్ సిటీ. వాళ్లు మొత్తం లంగలు. రైతులను బెదిరించి అసైన్డ్ భూములను కూడా లాక్కుంటున్నారు..కోర్టులో ఏమో ఫార్మాసిటీ రద్దు కాలేదని చెబుతున్నారు. బయట మాత్రం ఫోర్త్ సిటీ అంటున్నాడు..ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఏస్టేట్ దందా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను వేరే అవసరాలకు వాడితే కోర్టు ఒప్పుకోదు. అందుకే కోర్టును కూడా ఈ రేవంత్ రెడ్డి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని తెలిపారు.
ఫోర్త్ సిటీ పేరుతో చేస్తున్న డ్రామాలపై రైతులు కోర్టులో కేసులు వేయండి. మీ అందరికీ ఒక్క పైసా ఖర్చు కాకుండా బీఆర్ఎస్ లీగల్ సెల్ మీకు అండగా ఉంటుంది అని ప్రకటించారు