mt_logo

ఉన్న తెలంగాణ ను ఊడగొట్టి, ముంచిందే కాంగ్రెస్ : సీఎం కేసీఆర్ 

ఉన్న తెలంగాణ ను ఊడగొట్టి, ముంచిందే కాంగ్రెస్ అని అన్నారు సీఎం కేసీఆర్. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరి రోజు శాసనసభలో రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఉన్న తెలంగాణ ను ఊడగొట్టింది ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ.. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్. అది చరిత్ర.  జెంటిల్ మెన్ అగ్రిమెంట్, ఇతర ఒప్పందాలు కాలరాస్తే ప్రేక్షక పాత్ర వహించింది కాంగ్రెస్, 1969 ఉద్యమంలో ఉన్నతంగా తీసుకుపోయారు. ఆమోసు లాంటి వారి మీద ఎస్మా కేసులు పెట్టినా అనేక పోరాటాలు చేశారు. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు జీతాలు ఇవ్వకుంటే భట్టి విశ్వాల్ బిస్వా గారు తెలంగాణ ఉద్యోగులకు ఇతర వర్గాల వద్ద చేయిచాచి తెచ్చి జీతాలు ఇచ్చారు. చెన్నారెడ్డి నాయకత్వంలో నడిచిన ఉద్యమంలో తెలంగాణను ఇందిరాగాంధీ వ్యతిరేకించారు. ముల్కి రూల్స్ కొల్లగొట్టి దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టడానికి  కాంగ్రెస్ పార్టీ కారణం. 

1969 లో కళాశాలలు, హాస్టల్లు జైళ్లు అయ్యాయి. 41 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ . తెలుగుదేశం పార్టీ 17 సంవత్సరాలు నిర్వాకం చేస్తే తెలంగాణ పరిస్థితులు ఇంకా దిగజారాయి.  చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలు పెంచి మూడు సంవత్సరాలు వరుసగా 15 శాతం  పెరుగుతాయని నిర్ణయం తీసుకున్నారు. నేను చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా డిప్యూటీ స్పీకర్ హోదాలో  లేఖ రాశాను. కాంగ్రెస్ పార్టీ ప్రేక్షక పాత్ర వహించింది. ముగ్గురిని దారుణంగా కాల్చి చంపారు. కాల్పుల్లో మరణించిన వాళ్లు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలే. అంతా అయిపోయాక కాంగ్రెస్ దీక్ష పెట్టి శిబిరం ఏర్పాటు చేసుకున్నారు.

సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదని తెలిసి ఐదారుగురం కలిసి తెలంగాణ వచ్చే వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాం. ఐదారు మాసాలు ఉద్యమ పంధా నిర్ణయించుకుని ముందుకు వెళ్లాం. నిరాశ నిస్పృహ ఉండేది.ఐనా పటాపంచలు చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేశాం. దీనిమీద నేను స్వయంగా రాసిన పాట. సిపాయిల తిరుగుబాటు విఫలమైందని అంటూ నేనే రాసినా . అదే పద్ధతిలో రాజీలేని పోరాటం చేశాం. హింసకు గురిచేశారు, అవమానపరిచారు.  తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చి ఇచ్చారు. ఆంధ్ర నాయకులకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాబేదార్లుగా పని చేశారు. 2004 అద్భుతంగా విజృంభిస్తున్నాం. తెలంగాణ కోసం కాంగ్రెస్ తో కలిశాం. ఢిల్లీకీ వెళ్లి కామన్ మినిమం ప్రోగ్రంలో  పెట్టించినం, రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టించినమన్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేసిన మాటలు అవహేళనలు అన్నీ ఇన్నీ కావు. సెకండ్ ఎస్సారెస్సీ అనడం తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు  తబలా కొట్టడం. నంద్యాల సభలో సీఎం వైఎస్ మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన వెంటనే నంద్యాల సభలో రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు వెళ్లాలంటే వీసా తీసుకోవాలా అని హేళన చేశారు.  రేణుకా చౌదరి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రాన్ని పంచుకోవడానికి అదేమైనా దోశనా అని అన్నారు.నేను అడ్డం కాదు నిలువు కాదని రాజశేఖర్ రెడ్డి గారు హేళన చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు అవమానాలు ఇన్ని అన్నీ కాదు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంటే తెలంగాణ మంత్రుల్లో ఒక్కరు కూడా అడగలేదు. బడే మియా తో బడే మియా, చోటా మియా సుభానల్లా.. అన్నట్లు తలలూపారు. డిప్యూటీ స్పీకర్ గా ఉన్న అధ్వాని .హైదరాబాద్ తెలంగాణలో ఉంది తెలంగాణ  ఎందుకని అన్నారు. కాకినాడ తీర్మానం అమలు చెయ్యలే అని ప్రశ్నించారు. 

పీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ రావు అవమాన పరిచారు. మమ్మల్ని చూసి ఓట్లేశారని విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా రాజీనామా మళ్లీ ఎన్నికలకు పోతే రెండున్నర లక్షల ల ఓట్లతో గెలిచాను. చంద్రబాబు గిర్ గ్లాని కమిటీ వేశారు. కమిషన్ ఎందుకు అని అడిగాను. ఆనపకాయ అన్నోడు తెలంగాణ సొరకాయ అన్నోడు ఆంధ్రోడు అని చెప్పాను. సుమారు ఆరు దశాబ్ధాలు తెలంగాణ అన్నీ  కోల్పోయింది. ఆకలిచావులు, ఆత్మహత్యలు, తెలంగాణలో 20 ఎకరాలు ఉన్న భూస్వామి  కూడా హైదరాబాద్ కు వచ్చి ఆటోలు నడిపారు.

రోశయ్య గారు 14ఎఫ్ తీసుకు వచ్చారు. సిద్ధిపేటలో సభ పెట్టి కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్ర నో అని  కార్యక్రమం తీసుకున్నాను. తెలంగాణ అంటే పడనిములాయం సింగ్ ..రావు గారికి ఏమీ జరుగొద్దు అంటూ 38 పార్టీలతో కలిసి గోల చేశారు. చిదంబరం తో ప్రకటన చేపించారు. ఆంధ్ర లాబీల వల్ల వెనక్కి చేసిన తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. దీనివల్ల వందల మంది యువకులు చనిపోయారు. ఇషాన్ రెడ్డి, యాదయ్య, శ్రీకాంతాచారి  బలయ్యారు. జగన్ మోహన్ రెడ్డిని రాంగ్ గా హ్యాండిల్ చేశారు. జగన్ మోహన్ స్వంత పార్టీ స్థాపించుకున్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు.  2014 ఎన్నికల సమయంలో దేశమంతా ఎదురుగాలి.  తెలంగాణ ఇవ్వడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని కనీసం తెలంగాణలోనైనా పది సీట్లైనా వస్తాయని తెలంగాణ ఇచ్చారు.