mt_logo

బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించిన తొలి సీఎం కేసీఆర్

నిజామాబాద్: బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించిన తొలి సీఎం కేసీఆర్ అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కంటేశ్వర్‌లో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నా కవిత  మాట్లాడారు. బీసీ జనగణన చేయాలని కొత్తగా  రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు.. బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించిన తొలి సీఎం కేసీఆరే అని తెలిపారు. రాహుల్ గాంధీ 60 ఏళ్లు ఏం చేశారు మరీ అని అడిగారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎంత మంది బీసీలు ఉన్నారో గుర్తించాలన్నారు. 

బీసీ మంత్రిత్వ శాఖ గురించి బీఆర్ఎస్ ఎన్ని సార్లు అడిగినా కేంద్రంలో బీజేపీ స్పందించలేదు, కాంగ్రెస్ కనీసం మాట్లాడలేదన్నారు. 60 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు చేయని కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ ఇప్పుడు కుల గణన చేస్తాము అని మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు బీసీల గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు. దేశంలో ఎంత మంది బీసీలు ఉన్నారో లెక్క తేల్చాలని హెచ్చరించారు. మహిళా బిల్లులో కూడా బీసీ మహిళల కోట తేల్చాలన్నారు.