టీఆర్ఎస్ కు ప్రజలే పెన్నిధి, ప్రజలే నిధి అని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బుసంచులనుంచి పుట్టిన పార్టీ కాదని, ఉద్యమకెరటాలనుంచి పుట్టిన పార్టీ అని, ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే ఎన్నికల్లో పోటీచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజలనుంచి విరాళాలు అడుగుతుందని, ఏ ఒక్కరోజు కూడా ప్రజల్ని విరాళాలు కోరలేదని, ఎన్నికలువచ్చాయి కాబట్టే ఎంతో కొంత సాయం అందించాలని తెలంగాణ ప్రజానీకాన్ని కోరుతున్నానని కేసీఆర్ వివరించారు. టీఆర్ఎస్ విజయానికి ప్రజలందరూ ఆర్ధికంగా సహకరించాలని కోరుతూ ఎవరి ఆర్ధికశక్తి బట్టి వారు రూ.10, అంతకన్నా ఎక్కువగా విరాళాలు అందజేయాలని అన్నారు. విరాళాలు అందజేయాలనుకున్నవారు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలోని అకౌంట్ నంబరు:(266-101-00-00-2075) లో డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. కేసీఆర్ ఆ మాట చెప్పగానే వెంటనే స్పందించిన వరంగల్ జిల్లా జనగామకు చెందిన ముడుపు రాజిరెడ్డి అక్కడికక్కడే పార్టీ ఎన్నికల నిధికి 5 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు.