mt_logo

వెలుగు జిలుగుల తెలంగాణ – 25 వేల మెగావాట్ల విద్యుత్  ఉత్పత్తి లక్ష్యం

ఇండియా మొత్తంలో ఒక్క తెలంగాణ తప్ప 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం లేదన్నారు సీఎం కేసీఆర్.  మొన్న కూడా కాంగ్రెస్ కడుపుల మాట బయట పెట్రిండ్రు. 24 గంటలు కరెంట్ ఇస్తుంటే అడ్డగోలు మాట్లాడుతారు.  అన్నం ఉడికిందా లేదా అని కుండను పిసుకుతామా?  మెతుకు పిసికితే చాలు. ఇండియా మొత్తంలో 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం లేదు. కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు, ఎలక్ట్రికల్ ఆఫీస్ ల దగ్గర ధర్నాలు. చాలా కష్టపడి ఈ స్థితికి తీసుకువచ్చాం. నాలుగు నెలల్లో అల్ట్రా పవర్ ప్లాంట్ జెన్ కో ఆధ్వర్యంలో 30 వేల కోట్లతో 4000 మెగావాట్లతో నల్గొండలో పెట్టినం అన్నారు. మిగతా అన్ని పవర్ ప్రాజెక్ట్ లో గోదావరి ఒడ్డున ఉత్తరం వైపు ఉన్నాయి. 2444 మెగావాట్ల జలవిద్యుత్ దక్షిణ తెలంగాణలో శ్రీశైలం మీద ఉన్నప్పటికీ అది  సరిపోదు. మంత్రి జగదీశ్ రెడ్డి నల్గొండ జిల్లాలో పెట్టండి అని అన్నారు.  నాగార్జున సాగర్ కింద ఉంది కాబట్టి నిపుణుల నిర్ధారణ తర్వాత దామరచర్లలో ప్లాంట్ పెట్టాం. దీనిమీద అవాకులు, చవాకులు మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీ వస్తే దానిని ఆపేస్తారట కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే పుణ్యాత్ముడు మాట్లాడారు.

చట్టాన్ని కూడా గౌరవించలేని కేంద్రం ఉండటం మన దురదృష్టం

 25 వేల మెగావాట్ల విద్యుత్  ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ కి తెలంగాణ అంటే దుష్మన్ ఎందుకో తెలియదు. ఎన్టీపీసీ పునర్విభజన చట్టం ద్వారా 4000 మెగావాట్లు తెలంగాణకు ఇవ్వాలని చెప్పినా ఇవ్వడం లేదు. విద్యుశ్చక్తి పెంచుతారు కాని తుంచుతరా?. చట్టాన్ని కూడా గౌరవించలేని కేంద్రం ఉండటం మన దురదృష్టం. చేతనైతే కరెంటు ఇవ్వండి. కేవలం 1600 మెగావాట్లు సిద్ధం అయ్యింది.  జాతికి అంకితం అంటారు. రైల్వే స్టేషన్ల లిఫ్టు కూడా జాతికి అంకితం అంటారు. వందేమాతరం రైలుకు వంద సార్లు జెండా ఊపుతారు.తల్లిని చంపి బిడ్డను బతికించారు అని మోడీ అంటారు. 

మరో 600 మెగావాట్ల విద్యుత్

సింగరేణిలో  ప్రస్తుతం ఉన్న 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాకుండా మరో 600 మెగావాట్ల విద్యుత్ రాబోతుంది. నేను పర్మిషన్ ఇచ్చాను. త్వరలో 25 వేల మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో గోలీలాడుకుంటే వస్తుందా. ఎంతో మేథోమథనం జరుగాలి.  రెండేళ్లలో 24 గంటల కరెంటు ఇస్తామన్నాను. నాలుగేళ్ళలో ఇచ్చినా గులాబీ కండువా కప్పుకుంటా అని జానారెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్నారు. రుణమాఫీని అందుకుంటాం అని కాంగ్రెస్ అనుకుంది. రుణమాఫీ చేయడంతో సైలెన్స్ గా ఉన్నారు. అమెరికాలో మాట్లాడుతూ మూడు గంటలు కరెంటు చాలు అంటారు కాంగ్రెస్ అధ్యక్షుడు. 24 గంటల కరెంటు ఇవ్వడానికి ఎంతో మానిటరింగ్ చేస్తున్నాం. మూడు గంటల కరెంటు రైతులకు సరిపోతుందా? అన్నారు.

కాంగ్రెస్ గెలిచేది కాదు మన్ను కాదు. నూటికి నూరు శాతం  మళ్లీ మేమే గెలుస్తాం. గతంలో కన్నా రెండు మూడు సీట్లు ఎక్కువ వస్తాయి కానీ తక్కువ రావు. పరిపాలకులకు నీతి నిజాయితీ ఉంటే ప్రకృతి కూడా కరుణిస్తదని అన్నారు. కడుపునిండా కాలమవుతుంది. హైడల్ విద్యుత్ వస్తుంది. దీనిని రాజస్థాన్ కు ఇస్తున్నాం. పవర్ బ్యాంక్ ఏర్పాటుచేస్తున్నాం అక్కడ అని తెలిపారు. మనకు తక్కువ ఉన్నప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటాం. మొన్న వర్షం అధికంగా పడ్డా కూడా సెకండ్ కూడా కరెంటు పోకుండా మెయింటెయిన్ చేస్తామన్నారు.