వీధి కొళాయి లేని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు సీఎం కేసీఆర్. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరి రోజు శాసనసభలో రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. పార్లమెంటులో 100కు వంద సార్లు టాప్ కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా. కాంగ్రెస్ హయాంలో వీధి కుళాయిలు ఉండేవి .ప్రస్తుతం వీధి కొళాయి లేని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నం. 20 వేల లీటర్ల వరకు ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం. మిషన్ భగీరథ లో ఒక్క రూపాయి బిల్లు తీసుకుంటలేం. ఫ్రీగా నీటి సరఫరా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నే అన్నారు.
ఆదిలాబాద్ అంటురోగాలు ఎక్కడికి పోయాయి. మన్యం మంచమెక్కారనే వార్తలు రావడం లేదు. మొత్తం గ్రామాల్లో 20 వేల పై చిలుకు ఉండే తండాల్లో రక్షిత నీటి సరఫరా ఇస్తున్నాం. గ్రావిటీ మీదనే ఊర్లో నీళ్లు అందుతున్నాయి. జీరో ఫ్లోరోసిస్ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని చూడరు. కేసీఆర్ కు పిండం పెడ్తం. తక్కువ విద్యుత్ తో నడుస్తున్న మిషన్ భగీరథను 13 రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. తెలంగాణ మోడల్ కావాలని మహారాష్ట్రలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రెండున్నర లక్షల కిలోమీటర్ల పరిధిలో పైపులైను వేశాం. ఇది భూమి చుట్టూ ఐదుసార్లు తిరిగినంత పొడవు. ఇవేమీ కాంగ్రెస్ వారికి కనబడవు. ఎక్కడో ఒక సందులో పైపులైను సరిగ్గా ఉండకపోతే మాట్లాడుతారు. వీఆర్వోల్లో 21 వేల మందికి రెగ్యులర్ స్కేల్స్ ఇచ్చి ఆదుకున్నాం. మూడు వేల 700 మందిని మిషన్ భగీరథకు ఇచ్చినమని తెలిపారు.