ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరి రోజు శాసనసభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన తదనంతర ప్రగతి పథం మీద అందరూ మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. భట్టి విక్రమార్క రమ్యంగా పాదయాత్రను ఆవిష్కరించారు. పాదయాత్ర కు వెళితే ఎన్నో కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని భట్టి విక్రమార్క స్వామిజీ ప్రవచనంలా చెప్పారు. నాతో ఏకీభవిస్తారని అనుకుంటాను అన్నారు. తెలంగాణ 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటమని గుర్తు చేసారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ , జవహర్ లాల్ నెహ్రూ వల్లే నష్టం జరిగింది. ఉన్న తెలంగాణ ఉన్నట్లు ఉంటే ఎక్కడో ఉండేవాళ్లం. తలసరి ఆదాయం అభివృద్ధి సూచిక.
తెలంగాణ ఏర్పడ్డ రోజు ఎక్కడో ఉంది. పెద్ద రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానం 3,12,000, తెలంగాణ వారికి పరిపాలించడం రాదు అన్న వారి రాష్ట్రంలో 2,19,000 తలసరి ఆదాయం. వారికి మనకు లక్ష రూపాయలు తేడా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ , ఎప్పటినుంచో స్థిరపడ్డ తమిళనాడు, కర్ణాటక , హర్యానా కావచ్చు వీరికి తలదన్ని వీరికన్నా ఎక్కువ తలసరి ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు. సమ్మిళిత అభివృద్ధి జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. దానికి సూచనే మన తలసరి ఆదాయం.