ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఅర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాలో జనం చెబుతున్నారు.. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తాం అని తేల్చి చెప్పారు.
అందులో అనుమానమే లేదు.. ప్రజలు ఏమి కోల్పోయారో వారికి అర్థమయ్యింది.. ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయాయి. అందరూ కష్టపడి పనిచేయాలి అని పిలుపునిచ్చారు.
అధికారంలోకి రాగానే వాడిని లోపల వేయాలి.. వీడిని లోపల వేయాలని మనం చూడం. ప్రభుత్వం అంటే అందర్నీ కాపాడాలి.. నిర్మాణం చేయాలి. పదిమందికి లాభం చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు అని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో మనం మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు 10 శాతమే.. కానీ 90% ఎవరు ఆడగకున్న పనులు చేసి చూపించాం అని కేసీఆర్ గుర్తు చేశారు