ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జరిపిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ ద్వారా సమాధానమిచ్చారు.
తన 12 పేజీల లేఖలో విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన పురోగతి, జరిపిన విద్యుత్ కొనుగోళ్ల గురించి వివరిస్తూ.. కమిషన్ వ్యవహరిస్తున్న తీరును కేసీఆర్ తప్పుబట్టారు.