కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పలువురు రైతులు కేసీఆర్ ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందవుతుందని తెలిపారు. గత సంవత్సరం నీరు సంవృద్ధిగా ఉండేదని… ఇప్పుడు పొలమంతా ఎండిపోయింది అని వాపోయారు.
ఒకసారి వాగులోకి నీళ్లిస్తే రైతులందరు బతుకుదురని చెప్పారు.. స్పందించిన కేసీఆర్.. రైతులకు బీఆర్‌ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు.. రైతులకు బీఆర్‌ఎస్ మద్దతు ఉంటుందని తెలిపారు.
తరువాత చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించనున్నారు. అనంతరం శభాష్‌పల్లి వద్ద మిడ్ మానేర్ రిజర్వాయర్‌ను పరిశీలించనున్నారు. ఈరోజు పర్యటన ముగిసిన అనంతరం రాజన్న సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.