mt_logo

గుస్సాడి నృత్య గురువు కనకరాజు మరణం పట్ల కేసీఆర్ సంతాపం

తెలంగాణ సాంస్కృతిక కళారూపం గుస్సాడి నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

ఆదివాసీ జీవన విధానంలో విశిష్టతను సంతరించుకున్న సాంస్కృతిక కళారూపం గుస్సాడి నృత్య అభ్యున్నతికి తన జీవిత కాలం కృషి చేసిన కనకరాజు మరణం, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ వికాసానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు.

పద్మశ్రీ కనకరాజు చేసిన కృషిని గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని తగురీతిలో ప్రోత్సహించి సత్కరించిందని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.