mt_logo

తెలంగాణలో మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ పరిధిలో 1520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫిమేల్‌) పోస్టులకు  నోటిఫికేషన్‌ విడుదల చేసిన మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు. ఈ పోస్టుల కోసం mhsrb.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.ఆగస్టు 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 19వ తేదీ వరకు తుదిగడువు. ట్విట్టర్‌ వేదికగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌ రావు హర్షం వ్యక్తం చేసారు. వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నదన్నారు మంత్రి, అభ్యర్థులందరికీ మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.