సీమాంధ్ర నాయకత్వం చేసే ఉద్యమాల స్వభావం తెలియజెప్పే చెప్పే ఉదాహరణ ఇది. 1972లో జై ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో అక్కడ “ఆంధ్ర సేన”, “ఆంధ్ర ముక్తివాహిని” అనే రెండు గూండా సంస్థలు పేట్రేగిపోయాయి.
తెలంగాణలో తయారవుతున్నదన్న కారణంతో వారు చార్మినార్ సిగిరెట్లను నిషేధించిన విషయాన్ని ఇక్కడ చదవండి. (http://missiontelangana.com/jai-andhra-ban-on-charminar-cigarettes/)
ఇక అన్నిటికన్నా విడ్డూరమైన విషయం ఏమిటంటే బహుళజాతి కంపెనీ కోకాకోలా ఆస్తులపై ఈ ఆంధ్ర సేన, ఆంధ్ర ముక్తివాహిని గూండాలు దాడులు చేసి తీవ్ర భీభత్సం సృష్టించారు.
ఈ దాడులతో తీవ్ర నష్టాలకు లోనైన కోకాకోలా చివరికి తమకు తెలంగాణతో ఏ సంబంధమూ లేదని, తాము ఆంధ్ర ప్రాంతంలోనే వ్యాపారం చేసుకుంటున్నామని, ఉద్యోగాలు కూడా ఆంధ్ర ప్రాంతం వారికే ఇస్తున్నామని పత్రికా ముఖంగా ఒక ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఆ ప్రకటన కింద చూడండి
ఇదీ సీమాంధ్ర నాయకత్వం అసలు నైజం. వీళ్లా మన ఉద్యమాన్ని విమర్శించేది?