అనతికాలంలోనే హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ హబ్‌గా మారిందని, నేడు ప్రపంచానికి ఇక్కడినుంచి వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వెల్లడించారు. బుధవారం ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్‌చైన్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్‌చైన్ సెంటర్లు విరివిగా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మొదటి దశలో ఈ కేంద్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జీఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్‌చైన్ ప్రత్యేకతలు
-ఆహారం, వ్యాక్సిన్లను భద్రపరచడంలో ఈ కోల్డ్ చైన్ ఎంతగానో ఉపయోగపడనున్నది.
-వ్యాక్సిన్ ఉత్పత్తిలో తెలంగాణను మరింత బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది.
-పరిశోధనల పరంగా వర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ సహాయం అందించనున్నది.