mt_logo

హిమాన్షు నీ కొత్త పాట కోసం ఎదురుచూస్తున్నా..: మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు ఇదివ‌ర‌కే త‌న సింగింగ్ టాలెంట్‌ను బ‌య‌ట‌పెట్టుకొన్నారు. అమెరికా సింగ‌ర్ జాక‌బ్ లాస‌న్ పాడిన గోల్డెన్ అవ‌ర్‌ సాంగ్‌ను అద్భుతంగా ఆలపించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందారు. ఆ పాట‌లో ఆయ‌న పలికిన‌ ఆంగ్ల యాస మంత్ర‌ముగ్ధుల‌ను చేసింది. వావ్‌.. సూప‌ర్ అంటూ చాలామంది నెటిజ‌న్లు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇప్పుడు హిమాన్షు మ‌రో సాంగ్‌తో అల‌రించేందుకు మ‌న‌ముందుకు వ‌స్తున్నారు. ఈ విష‌యాన్ని హిమాన్షు ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు. ఈ నెల 24న నా కొత్త సాంగ్‌ను విడుద‌ల చేయ‌బోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశారు. స్పోటిఫైలో ఇది త‌న తొలిపాట అని, అంద‌రూ ఆశీర్వ‌దించాల‌ని ఆయ‌న కోరారు. ఈ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. హిమాన్షు కొత్త సాంగ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న‌ట్టు చెప్పారు. కాగా, 24న విడుద‌ల కాబోయే పాట కేటీఆర్‌కు హిమాన్షు ఇచ్చే బ‌ర్త్ డే కానుక అని, గోల్డెన్ అవ‌ర్ సాంగ్‌లాగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకోవాల‌ని నెటిజ‌న్లు ఆకాంక్షించారు.