mt_logo

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్ళడంతో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం బయట పడింది

సంగారెడ్డి జిల్లా, సదాశివపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. తదనంతరం మన బిన్ ఫౌండేషన్ నేత ముఖీమ్ తన మద్దతు దారులతో బీఆర్స్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..  రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం బయట పడిందన్నారు. అన్న, తమ్ముడు చెరొక పార్టీలో ఉన్నాడు. ఇన్నాళ్లు అన్న బీజేపీకి, తమ్ముడు కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినా ఏ పార్టీ కూడా చర్యలు తీసుకోదన్నారు. 

రెండు పార్టీలు కలిసి, తెలంగాణ బిడ్డను ఓడించాలని ప్లాన్ వేసారని తెలిపారు. సిద్ధాంతం లేని పార్టీలు ఎవరు నమ్మరు, కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇచ్చారు. మూడు చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో కలిసి పని చేశారు.  కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి రోజు మాట్లాడుకొని పని చేస్తున్నారు.కిషన్ రెడ్డి మరికొందరిని కాంగ్రెస్ లోకి పంపే యత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ సరెండర్ అయ్యి కాంగ్రెస్‌కు పని చేస్తున్నది. దొంగే దొంగ అన్నట్టు బీఆర్ఎస్ బీ టీమ్ అంటున్నారు. కషాయానికి కాంగ్రెస్ కు ఉన్న బంధం బట్ట బయలు అయ్యిందన్నాడు. 

బీజేపీ కేసీఆర్‌ను తట్టుకోలేక, కేసీఆర్‌ను ఓడించేందుకు చీకటి ఒప్పందం చేసుకున్నాయన్నారు. రాహుల్ గాంధీ మోడీకి బలం అయ్యారు. కేసీఆర్ కష్టపడి తెలంగాణ తేస్తే కుట్రలు చేస్తున్నాయి, కేసీఆర్ ఒక శక్తి, పరాయి వ్యక్తి మధ్య పోరాటం,  కేసీఆర్‌ను విజన్, ఉంటే బీజేపీ, కాంగ్రెస్ విషం చిమ్మతున్నదన్నారు. నమ్మి నానబెడితే పచ్చి బుర్రలు అయినట్టు ఉందన్నారు. ముఖీమ్ సహకారంతో సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగరటం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఆయన కోరిక మేరకు సదాశివపేట లో ఇంటి స్థలాలు లేని వారికి ఇస్తాం, ఇల్లు కూడా ఇస్తాం అని మాట ఇచ్చారు.  మరోసారి వచ్చేది బీఆర్ఎస్సే వస్తాడని తెలిపారు. జగ్గారెడ్డి గెలిచి ఒక్కనాడు కూడా ప్రజలలోకి రాలేదని తేల్చి చెప్పారు.