కాంగ్రెస్ వచ్చింది.. రాష్ట్రంలో తాగునీటి కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మేడికుండ తండాలో 15 రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని పేర్కొన్నారు.
మహిళలు కాలి నడకన వెళ్లి కుంట నుండి బిందెలో నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారు.. కలుషిత నీళ్ళు తాగటం వల్ల విషజ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలవుతున్నారు అని అన్నారు.
మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని అధికారులను వేడుకున్నా స్పందించడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకొని మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరద్ధరించాలని కోరారు.