mt_logo

బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే: హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి  వెంకట్రామరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి..సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేసినందుకు, గోబెల్స్ ప్రచారం చేసినందుకు నోటీసుకు ఇచ్చారు అని అన్నారు.

అస్సాంలో ఇలానే ఒకర్ని అరెస్టు చేశారు.. రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న. అరెస్టు చేయకుంటే మోడీ, రేవంత్ ఇద్దరు కలిసినట్టే.. ఇద్దరి దోస్తాన బయట పడ్డట్టే అని తేల్చి చెప్పారు.

గులాబీ జెండా ఉండగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది.. కాంగ్రెస్ వచ్చాక అనేక సమస్యలు.. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మహిళలకు రూ 2,500 అని మాట తప్పారు.. 30 దాటినా పింఛన్లు ఇవ్వడం లేదు.. తులం బంగారం ఇస్తా అని మోసం చేశారు.. కాంగ్రెస్ వాళ్లు వచ్చాక బంగారం ధర కూడా పెరిగింది.. నిరుద్యోగ భృతి అని మోసం చేశారు అని విమర్శించారు.

కాంగ్రెస్‌‌కు మళ్ళీ ఓటు వేస్తే హామీలు అమలు చేయరు.. కొట్లాడ్లంటే మీరు బీఆర్ఎస్‌ని గెలిపించాలని కోరుతున్నా..కాంగ్రెస్ పాలన బయటపడ్డది అని పేర్కొన్నారు.

బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే.. తెలంగాణకు ఎంతో నష్టం చేసింది బీజేపీ..అందువల్ల బీజేపీని నమ్మద్దు అని మనవి చేస్తున్నా. అలవిగాని హామీలు ఇస్తే మొన్న దుబ్బాకలో ఆయన్ని చిత్తుగా 54 వేల ఓట్లతో ఓడించారు అని హరీష్ అన్నారు.