రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ, 191 రోజులు గడిచినా ఆచరణలో మాత్రం విఫలమైంది అని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు.
పక్క రాష్ట్రం ఏపీలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు అన్ని రకాల పింఛన్లు పెంచితే, ఒరిస్సా ముఖ్యమంత్రి గారు వరి కనీస మద్దతు ధర క్వింటల్ కు రూ. 3,100 చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా, వృద్ధులు, వితంతువుల పింఛన్లు 4 వేల రూపాయలకు, దివ్యాంగులకు 6 వేల రూపాయలకు పెంచుతూ తక్షణం నిర్ణయం తీసుకోవాలి అని కోరారు.
10% మాత్రమే పండించే సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారెంటీలు, 13 హామీల అమలు చేయాలని హరీష్ అన్నారు.