mt_logo

తెలంగాణలో రేపట్నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణ‌లో రేప‌ట్నుంచి (మార్చి 15) ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో మంగ‌ళ‌వారం నుంచి ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు కొన‌సాగ‌నున్నాయి. మ‌. 12:30 గంట‌ల‌కు మ‌ధ్యాహ్నం భోజ‌నం పెట్టి, విద్యార్థుల‌ను ఇంటికి పంప‌నున్నారు. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు కొన‌సాగుతాయ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *