-అభినందించిన తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హరితహార కార్యక్రమం ద్వారా పచ్చదనం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కితాబునిచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో హరితహారంపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. 2015 నుంచి 2021 వరకు తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం (గ్రీన్ కవర్) 7.70 శాతం పెరిగినట్లు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్ (ISFR) ప్రకటించిందని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరిని అభినందించారు.