mt_logo

రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు మోకాలడ్డు పెడుతున్న గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

రాష్ట్ర ప్రభుత్వంపై వ్య‌తిరేక వైఖ‌రితోనే ఆర్టీసీ బిల్లును గ‌వ‌ర్న‌ర్ ఆపుతున్నార‌ని కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో  ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం కేబినెట్ నిర్ణ‌యానికి అనుగుణంగా ఆర్టీసీ బిల్లు రూపొందించింది. నేడు కొనసాగుతున్న అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ చేస్తారనే సంకల్పంలో తెలంగాణ సర్కారు ఉంది. కానీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ నుండి ఎలాంటి సమాధానం లేదు కదా.. రెండు రోజులైనా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.