యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంట పెట్టుబడి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయుటకు ఎన్నికల కమిషన్ ఆమోదించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి ఏటా వానాకాలం సీజన్ మరియు యాసంగి సీజన్ ప్రారంభం అయిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి ఆర్థిక సహాయంగా రైతుబంధు నిధులను విడుదల చేస్తున్నది.
అదే విధంగా ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధును గతంలో వలె తక్కువ భూ విస్తీర్ణం ఉన్న రైతులకు మొదటగా ఇచ్చే పద్ధతిలో పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నెల 25, 26 ,27 తేదీల్లో బ్యాంకు హాలిడేస్ వున్నవి. అలాగే ఈ నెల 29, 30 తేదీల్లో రైతుబంధు పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతించలేదని తెలిపింది.
తదనుగుణంగా రైతుబంధు పెట్టుబడి ఆర్థిక సహాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమజేయుటకు నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపింది. రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్లో 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది.