mt_logo

ఏపీ మంత్రి బొత్సకు తెలంగాణ మంత్రి గంగుల ఘాటు కౌంటర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై రాష్ట్ర మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మండిప‌డ్డారు. తెలంగాణ విద్యా వ్య‌వ‌స్థ గురించి తెలుసుకోకుండా, బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ‌టం స‌రికాదని అన్నారు.  క‌రీంన‌గ‌ర్‌లో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యారంగంలో ఏపీకి ఒక్క అవార్డైన వచ్చిందా అంటూ నిలదీసారు. విద్యావ్యవస్థలో తెలంగాణ కేరళ ను నుంచి మించి పోయింది, తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర నాయకులు విషం చిమ్ముతున్నారు.అప్పటి కాంగ్రెస్ నాయకులే ఇప్పటి వైఎస్సార్ సీపీ మంత్రులు.బొత్స సత్యనారాయణ విద్యా వ్యవస్థ పై కామెంట్ చేసారు. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ లో విద్యా విధానం బాగుందని మెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సరిపడా గురుకులాలు లేవు. 298 గురుకులాలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు.  

ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సరిగా లేదు. ఇప్పుడు తెలంగాణ లో 1019. గురుకులాలు ఉన్నవి, 6,75,000 మంది విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చదువుతున్నారు. ఒక్కోక్క విద్యార్థిపై‌ లక్ష రూపాయల ఖర్చు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఏపీ లో ఇప్పటికీ 308 గురుకులాలు మాత్రమే ఉన్నవి. 25000 మంది విద్యార్థులు ‌మాత్రమే గురుకులాలో చదువుతున్నారు. బొత్స సత్యనారాయణ నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని ప్రశ్నించారు. మా ముఖ్యమంత్రి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవకతవకలు జరిగితే దొంగలని దొరకపట్టినారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర మీది అని విరుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాకా  ఆంధ్ర వారి కన్ను తెలంగాణ మీదనే ఉన్నది అన్నారు.  తెలంగాణ తో మీకేమి పని. తెలంగాణ లో పైరవీలకు తావు లేదు, ఆంధ్ర నాయకులు మీ విద్యా విధానం చూసి సిగ్గుతో తలవంచుకోవాలి.  దేశంలోనే అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందన్నారు.