mt_logo

పాలనపై పట్టులేక, ఆఫీసర్లతో రేవంత్ బదిలీల బంతాట!

పాలనపై పట్టులేకనో లేక అధికారులపై నమ్మకం లేకనో, అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వందల బదిలీలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నుండి ఆర్డీవోలు, ఎమ్మార్వోల వరకు బదిలీల పర్వం నిత్యకృత్యమైంది.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులు కొత్త చోట బాధ్యతలు స్వీకరించి, కుదురుకునేలోగా తిరిగి బదిలీ వేటు వేస్తూ ఇబ్బంది పెడుతున్నది. దీంతో అధికారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. రేవంత్ అనుభవరాహిత్యం, అనుమానమే దీనికి ప్రధాన కారణాలు అని టాక్ నడుస్తుంది. కేవలం పది నెలల కాలంలో గతంలో ఎన్నడూ ఇన్ని సార్లు ప్రభుత్వ అధికారులను బదిలీలు చేసిన దాఖలాలు లేవు.

దీంతో పాలన అస్తవ్యస్తమై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతున్నది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడుంటామో, ఎప్పుడు ఊడుతామో తెలియక పనుల మీద ఆఫీసర్లు సీరియస్ దృష్టి పెట్టలేకపోతున్నారు. సిన్సియర్ ఆఫీసర్లుగా పేరున్న ఆఫీసర్లను కూడా తరచూ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది రేవంత్ సర్కార్. ఫలితంగా.. పాలన పడకేసి, రాష్ట్రం అధోగతి పాలవుతుంది.

తాజాగా, గతంలో రేవంత్ రెడ్డి జరిపిన ట్రాన్స్‌ఫర్ల ప్రహసనం తాలూకు కొన్ని ఉదాహరణలు

  • గతంలో వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా పనిచేసిన శ్రీదేవిని ఆగస్టు 3న ఎస్సీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇప్పుడు పురపాలకశాఖ కమిషనర్‌ ఎండీగా బదిలీ చేశారు.
  • ఆర్‌ అండ్‌ బీ సంయుక్త కార్యదర్శి హరీశ్‌ను ఆగస్టు 3న రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు. ఇప్పుడు ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌ బాధ్యతలు అప్పగించారు.
  • శశాంకను జనవరి 3న మహబూబాబాద్‌ నుంచి రంగారెడ్డి కలెక్టర్‌గా పంపగా, ఇప్పుడు స్టేట్‌ ఫ్లాగ్‌షిప్‌ ప్రాజెక్ట్స్‌ కమిషనర్‌గా నియమించారు.
  • హన్మంతరావును ఫిబ్రవరి 5న ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌గా నియమించి, ఇప్పుడు యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా బదిలీ చేశారు.
  • ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా మంచి పనితీరు కనబరుస్తున్న సీవీ ఆనంద్‌ను హఠాత్తుగా ట్రాన్స్‌ఫర్ చేసి హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా నియమించారు.
  • అలాగే హైదరాబాద్ పోలీస్ కమీషనర్‌గా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసి డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్‌గా నియమించారు.
  • ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ గత ఏడు నెలల్లో అయిదుసార్లు బదిలీ అయ్యారు. నవంబర్‌లో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న ఆయనను పోలింగ్‌ సమయానికి వీఆర్‌లో పెట్టారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌ సిటీ క్రైమ్‌ జాయింట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. మార్చిలో మరోసారి మల్టీజోన్‌-1 ఐజీగా బదిలీ అయ్యారు. తరవాత హైడ్రా కమిషనర్‌గా నియమించారు.
  • డిసెంబర్‌ వరకు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రిజ్వీని రేవంత్‌ సర్కారు వచ్చాక విద్యుత్తుశాఖకు ముఖ్యకార్యదర్శిగా నియమించింది. ఇప్పుడు మళ్లీ ఆయనను విద్యుత్తు నుంచి తప్పించి వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది.
  • డిసెంబర్‌లో రాష్ట్ర ప్రజాసంబంధాల శాఖ కమిషనర్‌గా, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న కోరెం అశోక్‌రెడ్డిని రాష్ట్ర హార్టికల్చర్‌ డైరెక్టర్‌గా మార్చిలో నియమించారు. ఇప్పుడు హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు ఎండీగా బదిలీ చేశారు. అంటే ఆరు నెలల్లో మూడోసారి పోస్టింగ్‌ మార్చారు.
  • కరీంనగర్‌ కలెక్టర్‌గా మళ్లీ పమేలా సత్పతిని పంపించారు. డిసెంబర్‌లో రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఆమెను, రేవంత్‌ సర్కారు కరీంనగర్‌ కలెక్టర్‌గా నియమించింది. ఆ తర్వాత బదిలీ చేసింది. మళ్లీ ఏమైందో ఆమెనే తిరిగి కరీంనగర్‌ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
  • టీఎస్‌ఐఐసీ ఎండీగా ఉన్న ఈవీ నర్సింహారెడ్డిని ట్రైబల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌గా రేవంత్‌ సర్కారు బదిలీ చేసి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా నియమించింది.
  • మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా కొనసాగుతున్న మల్లయ్యభట్టును గత మార్చిలోనే ప్రభుత్వం బదిలీ చేసింది. గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనే హడావిడిగా ట్రాన్స్‌ఫర్‌ చేసింది. సమగ్ర సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు స్టేట్‌ డైరెక్టర్‌, తెలంగాణ ఎడ్యుకేషన్‌, వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా నియమించింది. మల్లయ్యభట్టును పేరెంట్‌ డిపార్ట్‌మెంటైన బీసీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌కే వెనక్కి పంపించింది.
  • కీలకమైన సీడీఏంఎలను మార్చడంలో రేవంత్ సర్కారు సరికొత్త రికార్డు సృష్టించింది. మొదటి ఆరు నెలల పాలనలోనే నలుగురు సీడీఏంఎలు వచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేనాటికి అర్వింద్‌ కుమార్‌ అదనపు బాధ్యతల్లో కొనసాగుతుండగా గత డిసెంబర్‌ 18న హరిచందనను సీడీఎంఏగా నియమించారు. ఆమె రెండు వారాలు మాత్రమే కొనసాగారు. ఈ ఏడాది జనవరి 2న దివ్య దేవరాజన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆరు నెలలు గడువకుండానే ఆమెను సెర్ప్‌ సీఈవోగా బదిలీచేశారు. వీపీ గౌతమ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • ఐఏఏస్ అధికారిణి హరిచందనను డిసెంబర్ 2023లో సీడీఎంఏగా, జనవరి 2024లో నలగొండ కలెక్టర్‌గా నియమించి, ఆర్&బీ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.
  • కీలకమైన రాచకొండ పోలీస్ కమీషనర్‌గా డిసెంబర్ 2023లో సుధీర్ బాబును నియమించిన సర్కార్ రెండు నెలలు తిరక్కుండానే ఆ పోస్టులో తరుణ్ జోషీని నియమించింది. తిరిగి జూలై నెలలో మళ్ళీ సుధీర్ బాబును నియమించింది