హైదరాబాద్ నగరానికి ప్రపంచ గుర్తింపు మరియు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను తెచ్చిపెట్టిన ఫార్ములా-ఈ రేస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక విష ప్రచారాన్ని చేపట్టింది.
ఫిబ్రవరి 2023లో భారతదేశంలో మొదటిసారిగా జరిగిన ఈ రేస్, బీఆర్ఎస్ పాలనలో ఒక కలికితురాయి. హైదరాబాద్‌లో జరిగిన ఎలక్ట్రిక్ కార్ రేస్ వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు రూ. 700 కోట్ల ప్రయోజనం చేకూరిందని నీల్సన్ నివేదికలో స్పష్టం చేసింది.
కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫార్ములా-ఈ రేస్‌ను ఏకపక్షంగా రద్దు చేసి, దుష్ప్రచారాన్ని మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కార్ రేస్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 55 కోట్లు దుర్వినియోగం చేసిందన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు.
నిజాల్లోకి వెళ్తే.. ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో తెలంగాణ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి సంవత్సరం ఈవెంట్‌కు గ్రీన్‌కో వంటి సంస్థల నుండి స్పాన్సర్‌షిప్‌లను పొందింది. అయితే, ఫిబ్రవరిలో 2024 లో జరగాల్సిన రెండవ రేస్‌కు వివిధ కారణాల చేత స్పాన్సర్‌షిప్ సమస్యలు తలెత్తాయి.
2024 జూన్-జూలై నాటికి.. అంటే సరిగ్గా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, స్పాన్సర్‌లు లేకుండా తాము రేస్‌ను నిర్వహించలేమని సదరు సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేశారు.
ప్రతిస్పందనగా, అప్పటి మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 2024 నాటికి రేస్ నిర్వహణకు స్పాన్సర్‌షిప్‌లను పొందుతామని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. రేస్ వేరే నగరాలకు వెళ్లకూడదన్న ఉద్దేశంతో హెచ్‌ఎండీఏ నుండి రూ. 55 కోట్ల నిధులను తాత్కాలికంగా నిర్వాహకులకు బదిలీ చేశారు. ఇదే విషయాన్ని ఇటీవల కేటీఆర్ ఒక ప్రెస్ మీట్‌లో కూడా వివరించారు.
ఫార్ములా-ఈ రేస్‌కు హెచ్‌ఎండీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించింది. కేవలం రేస్ విజయవంతం అవ్వాలన్న ఉద్దేశంతోనే, అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే, తమ పరిధికి లోబడే హెచ్‌ఎండీఏ 55 కోట్ల రూపాయలను ఫార్ములా-ఈ నిర్వాహకులకు బదిలీ చేసింది.
వాస్తవానికి.. ముఖ్యమంత్రి చైర్మన్‌గా మరియు మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా ఉండే హెచ్‌ఎండీఏ ఒక స్వయంప్రతిపత్తి గల సంస్థ. హెచ్‌ఎండీఏ నిధులు వాడుకోవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ నుండి ఎటువంటి ఆమోదం అవసరం లేదు.
రూ. 55 కోట్ల నిధులు పారదర్శకంగా నేరుగా రేస్ నిర్వాహకులకు బదిలీ చేయబడ్డాయి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రేస్‌ని రద్దు చేయకుండా కొనసాగించి ఉంటే, అసలు ఈ అంశం చర్చలోకే వచ్చేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్ల హైదరాబాద్‌లో ఫిబ్రవరి 2024లో జరగాల్సిన రేస్ రద్దయింది. స్వయానా రాష్ట్ర ప్రభుత్వమే రేస్‌ను రద్దు చేసిన కారణంగా నిర్వాహకులు నిధులను తిరిగి ఇవ్వలేదు.
కాంగ్రెస్ ఎన్నో నిరాధార ఆరోపణలు చేస్తున్నప్పటికి.. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణలో ఎలాంటి నిధుల దుర్వినియోగం లేదా మనీలాండరింగ్ జరగలేదు. ఈ రేస్ వల్ల కేటీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందినట్లు ఎటువంటి ఆధారాలు కూడా లేవు.
పైపెచ్చు.. రేస్ నిర్వాహకులతో దీర్ఘకాలిక ఒప్పందం నుండి వైదొలగాలనే రేవంత్ ప్రభుత్వ తొందరపాటు నిర్ణయం చివరికి ఫార్ములా-ఈ నిర్వాహకులకు ఉపయోగకరంగా మారింది.. తెలంగాణ ప్రభుత్వం నష్టపోయింది.
కేవలం కేటీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలనే ఒక కుట్ర వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు తీవ్ర విఘాతం కలిగింది. మొత్తానికి.. భవిష్యత్తులో అంతర్జాతీయ సంస్థలు ఫార్ములా-ఈ రేస్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు తెలంగాణలో నిర్వహించాలంటేనే భయపడే స్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చింది.