సమైక్య రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని మతాలు, కులాల అభివృద్ధికి ఇతోధిక కృషిచేస్తున్నారు. సరికొత్త సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మైనార్టీ ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం షాదీముబార్ ద్వారా లక్ష రూపాయలు అందజేస్తున్నారు. అలాగే, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసి, ఆ బిడ్డల విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నారు. తాజాగా నిరుపేద మైనారిటీ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా మరో సరికొత్త కార్యక్రమానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. కేసీఆర్ కానుక పేరుతో నిరుపేద మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు నిర్ణయించింది.
20 వేల కుట్టుమిషన్ల పంపిణీ
కేసీఆర్ కానుక కార్యక్రమంలో భాగంగా 20 వేల మంది నిరుపేద మైనారిటీ మహిళలను గుర్తించి, వారికి కుట్టు మిషన్లను అందజేయనున్నారు. ఇందుకోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర సర్కారుకు ప్రతిపాదనలు పంపగా, ఆమోదం లభించింది. మైనార్టీ మహిళల నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం అర్హులను గుర్తించి వారికి కుట్టుమిషన్లు అందజేస్తారు.
కుట్టు మిషన్లు ఎవరికిస్తారంటే..?
- నిరుపేద మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘కేసీఆర్ కానుక’ కింద 20 వేల కుట్టుమిషన్లు అందజేయనున్నారు.
– ఇందులో మైనారిటీలందరికీ కలిపి 18వేలు, క్రిస్టియన్ మైనారిటీలకు 2వేల మిషన్లు అందజేస్తారు.
– 21-55 ఏండ వయసు ఉన్న వారు దరఖాస్తు చేసేకొనేందుకు అర్హులు.
– గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఆదాయం లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన మైనారిటీ మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
– దరఖాస్తుతో కుల, ఆదాయ ద్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో జతచేయాలి.
– ఒంటరి, వితంతు, విడాకులు పొందిన, నిరుపేద మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
– పూర్తి వివరాలకు జిల్లా మైనార్జీ సంక్షేమ కార్యాలయంలో సంప్రదించవచ్చు