కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని రాహుల్ గాంధీ నమ్మించి మోసం చేశారని దుయ్యబట్టారు.
రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఎండగడతం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని బూతులు తిట్టినా, అవమైంచిన వారిని వదిలిపెట్టం.. ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.