mt_logo

కేటీఆర్ చేసినంత కృషి దేశ ప్రధాని కూడా చేయలేదు : మంత్రి వేముల

నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్.. 

  • తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కుటుంబమే
  • బండి సంజయ్.. నీ ఇంట్లో వాళ్లు,నీదగ్గరి బందువులు కూడా కేసీఆర్ ప్రభుత్వ లబ్ధిదారులే
  • అమెరికాలో ఉన్నత జీవితాన్ని వదులుకొని తెలంగాణ ఉద్యమంలో కోట్లాడిన కేసీఆర్ కుటుంబం గురించి బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదం
  • విదేశీ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడానికి కెటిఆర్ చేసినంత కృషి దేశ ప్రధాని కూడా చేయలేదు
  • కవితమ్మ తెలంగాణ సంస్కృతిని విశ్వ వ్యాప్తం చేసింది
  • కేసీఆర్ గారి గురించి,కేసీఆర్ ఫ్యామిలీ గురించి నోటి కొచినట్టు మాట్లాడితే జాగ్రత్త

హైదరాబాద్: తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కుటుంబమేనని బండి సంజయ్ ఇకనైనా తెలుసుకుంటే మంచిదని  రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగిందని గణాంకాలతో సహా పార్లమెంట్ సాక్షిగా నీ కేంద్ర మంత్రులే ఈ విషయాన్ని వెల్లడించారని గుర్తు చేశారు. విదేశీ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడానికి యువనాయకుడు కేటిఆర్ చేసినంత కృషి ప్రధాని కూడా చేయలేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితమ్మ ఉద్యమంలోనే జాగృతి సంస్థతో  తెలంగాణ సంస్కృతిని విశ్వ వ్యాప్తం చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ పిల్లలు ప్రజా ఆమోదంతో రాజకీయాల్లో ఉన్నారని,ఉద్యమం కోసం అమెరికాలో వారి ఉన్నత ఉద్యోగాలు,లగ్జరీ జీవితాన్ని వదులుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడి,ఎన్నో కేసులు,అరెస్టులు ఎదుర్కొని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. యువ నాయకుడు కెటిఆర్ కృషి వల్ల రాష్ట్రంలో 3లక్షల కోట్ల పెట్టుబడులు,18వేల కంపెనీలు,16 లక్షల ఉద్యోగాలు లభించాయని అన్నారు.

ప్రపంచ ప్రముఖ దిగ్గజ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజన్ ను, కేటీఆర్ గారి చొరవను బహిరంగ వేదికల మీదనే కొనియాడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని మోడీ తన దోస్త్ అదానీ కోసం పైరవీలు చేసి శ్రీలంక,ఆస్ట్రేలియా లాంటి విదేశాల్లో భారత దేశ పరువు మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదాని కోసమే ప్రధాని పదవి చేపట్టినట్టు మోడీ దేశ సంపద అంతా అధానికి దారాదత్తం చేస్తున్నారని,మోడీ దేశానికి అసలు ఏం చేశాడో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఒలంపిక్ క్రీడాకారులు నిరసన వ్యక్తం చేస్తుంటే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని,బీజేపీ ఎంపీపై ఆడ పిల్లలు ప్రత్యక్షంగా రోడ్డు మీదకి వచ్చి ఆరోపణలు చేస్తుంటే..ఇక్కడ క్రీడల పోటీలు పెట్టుకొని,కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటన్నారు. దేశంలో ఏ రంగాన్ని మీరు ఉద్ధరించారు అని గొప్పలు చెప్పుకుంటున్నారు.5 నెలల్లో మేము కాదు నీవు, నీ మోడీ పత్తా లేకుండా పోతారని అన్నారు. కర్ణాటకలో ప్రజలు కర్రకాల్చి వాత పెట్టారని,నీవు ప్రచారం చేసిన ఒక్క సీటు కూడా గెలువలేదు, నీ వల్ల ఏం కాదని నీ చుట్టూ ఉన్నవాళ్లే నీ చాటుకు వచ్చి నవ్వుతున్నారు ముందు అది తెలుసుకో బండి సంజయ్ అని మంత్రి ఎద్దేవా చేశారతెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ సాధించిన ప్రగతి మీద జరుగుతుంది. నీ ఇంట్లో వాళ్ళు కూడా కేసీఆర్ ప్రభుత్వ లబ్దిదారులే,నీ ఇంట్లో వాళ్లు, నీదగ్గరి బందువులు కూడా దశాబ్ది వేడుకలు జరుపుకుంటారు ఒకసారి వారిని అడిగి తెల్సుకో బండి సంజయ్ అని అన్నారు.కేసీఆర్ గారి గురించి,కేసీఆర్ ఫ్యామిలీ గురించి నోటి కొచినట్టు మాట్లాడితే జాగ్రత్త,బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి వేముల హెచ్చరించారు.