mt_logo

విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులను తీర్చిదిద్దుతాం : మంత్రులు సబిత, తలసాని

విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులను తీర్చిదిద్దుతామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్‌లో 2.22 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు, బన్సీలాల్ పేటలోని ప్రభుత్వ పాఠశాలలో 1.84 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను మంత్రులు ప్రారంభించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి మేకలమండి పాఠశాలను హై స్కూల్ గా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పేద విద్యార్థులు అధికంగా విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో మన బస్తీ మన బడి కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నాం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం, వారానికి 3 రోజులు రాగి జావ అందిస్తున్నామని తెలిపారు.