
ముఖ్యమంత్రి కేసీఆర్ సాయిచంద్ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయలు అందజేశారు. సాయిచంద్ కుటుంబానికి సీఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా వుంటారని డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, డాక్టర్ దాసోజు శ్రవణ్, కట్టెల శ్రీనివాస్ యాదవ్ కలిసి పార్టీ తరపు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కోటిన్నర రూపాయిలలో కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని శ్రీమతి రజిని సాయిచంద్, కూతురు మినాల్, కొడుకు చరిష్ కు గుర్రంగూడాలోని వారి నివాసంలో కలిసి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడిచిన దివంగత బీఆర్ఎస్ నేత సాయి చంద్ తన పాటతో తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహా కళాకారుడు. తన ఆట పాటతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అడుగులో అడుగుగా ప్రతి బహిరంగ సభల్లో తన ఆటాపాటలతో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు.
దురదృష్టవశాత్తు కాలం చేశారు. ఈ నేపథ్యంలో బాధ్యత గల తండ్రి స్థానంలో సాయి చంద్ కుటుంబాన్ని ఆదుకున్నారు కేసీఆర్. వారి కుటుంబానికి అండగా ఉంటూ సాయి చంద్ గారి సతీమణి రజనీ గారిని వెంటనే గిడ్డంగుల కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించన విషయం తెలిసిందే. వారి ఇద్దరి పిల్లల భవిష్యత్తు బాగుండాలని, కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఉండ కూడదని పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయలు కేటాయించారు కేసీఆర్.
మహబూబ్‌నగర్‌లో సాయి చంద్ తండ్రి, చెల్లమ్మకు ఎమ్మెల్యే సుమన్ వెళ్లి యాబై లక్షల చెక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కోటి రూపాయిల చెక్ ని సాయి చంద్ గారి సతీమణి రజనీ గారికి అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా సాయి చంద్ కుటుంబానికి ఏ లోటు కేసీఆర్ గారు కన్నతండ్రిలా వుంటారు. బీఆర్ఎస్ పార్టీ, నాయకులు, కార్యకర్తలు కూడ సాయి చంద్ కుటుంబానికి అండగా వుంటాం’’ అని శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, మంచి రెడ్డి కిషన్ రెడ్డి తెలియజేశారు.