mt_logo

ఆన్‌లైన్ డ్రా పద్దతిలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించిన మంత్రులు

సొంత ఇల్లు లేని పేదల కల నెరవేర్చడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఆన్‌లైన్ డ్రా పద్దతిలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ప్రారంభించారు.

సెప్టెంబర్ 2న కుత్బుల్లాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే దేశంలోనే మొదటిసారి ఆన్‌లైన్ డ్రా పద్దతిని తీసుకువచ్చారు. ఎన్ఐసీ (NIC) రూపొందించిన ర్యాండమైజేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో నుండి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో మొదటి విడతలో 12 వేల మందికి ఇండ్ల పంపిణీ జరగబోతుంది. గత ప్రభుత్వాలు నామమాత్రపు ఆర్ధిక సహాయంతో ఇండ్లను నిర్మించాయి అని.. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.