సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో 1125 మంది గిరిజనులకు 1808 ఎకరాల పోడు భూముల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొడుకు పట్టం కట్టింది సీఎం కేసీఆర్, గిరిజనులకు కేసీఆర్ పాలన స్వర్ణయుగం, భూములు ఇవ్వడంతో పాటు రైతు బంధు రైతు బీమా ఇస్తున్నారని అన్నారు. కరెంట్ కనెక్షన్ వస్తుంది. మీ భూమి కాబట్టి వారసులకు ఇవ్వొచ్చు.
పంట నష్టం జరిగితే పరిహారం అందుతుంది, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ ధరకు వస్తుంది. వ్యవసాయ మార్కెట్ పదవులు కూడా మీకు వస్తాయి. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచింది సీఎం కేసీఆరే అన్నారు. తెలంగాణ వచ్చాక ఎన్ని మార్పులు వచ్చాయి. ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, ఇంటికి నీళ్ళు.. ఇవన్నీ బీఆర్ఎస్ పాలనలో వచ్చినవే అని సూచించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ గారు అమెరికా, సింగపూర్ లెక్క అభివృద్ధి చెందింది. కేసీఆర్ బాగా పని చేస్తున్నాడు అని అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న రజనికి అర్థమైంది, కానీ ఇక్కడే ఉండే గజినీలకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేసారు.