దళిత పారిశ్రామికవేత్తల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న డిక్కీ, ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ ఎక్స్ పోను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పారిశ్రామిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సెల్ఫ్ మోటివేషన్ తో లక్ష్యాలను సాధించిన పారిశ్రామికవేత్తలను ప్రశంసించారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసిందని మంత్రి చెప్పారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఎక్స్ పోలో స్టాల్స్ ను చూస్తుంటే దళితుల శక్తి సామర్ధ్యాలు అర్థమవుతున్నాయని, దళితులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తలకు 5 కోట్ల రూపాయల మార్జిన్ మనీ ఇస్తుందని, పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఏ పారిశ్రామికవేత్తా కాళ్ళరిగేలా తిరగాల్సిన అవసరం లేదని, ఎలాంటి అప్లికేషన్ అయినా తెలంగాణ గవర్నమెంట్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉందని తెలిపారు. పది, పదకొండు రోజుల్లో పరిశ్రమకు కావాల్సిన అన్ని అనుమతులు మంజూరవుతాయని సీఎం స్పష్టం చేశారు.