స్వచ్ఛ వరంగల్ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈరోజు ఉదయం వరంగల్ లో ప్రారంభించారు. టీచర్స్ కాలనీలో చేపట్టిన స్వచ్ఛ వరంగల్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ హైదరాబాద్ మాదిరిగానే స్వచ్ఛ వరంగల్ ను చేపట్టామని, నగరాన్ని మొత్తం 61 యూనిట్లుగా విభజించామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికుల సహకారంతో స్వచ్ఛ వరంగల్ ను విజయవంతం చేస్తామని, ప్రస్తుతానికి వరంగల్ పట్టణంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ నెలాఖరులోగా గ్రేటర్ వరంగల్ మొత్తం పరిసరాల పరిశుభ్రత చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కొండా సురేఖ, వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.