mt_logo

మహారాష్ట్ర ఫలితాల తర్వాత రేవంత్ సీఎం పదవి ఊడటం ఖాయం: దాసోజు శ్రవణ్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ తెలంగాణ పాలిట శాపంలా మారారు. రాజకీయాలను రేవంత్ చిల్లర మల్లరగా మార్చారు అని మండిపడ్డారు.

తొక్కుతా, చంపుతా, పేగులు మెడలు వేసుకుంటా అని సీఎం పదవిలో ఉండి ఎవడైనా మాట్లాడతాడా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసే వాళ్ళు మాట్లాడే మాటలేనా? కేవలం పిచ్చి పట్టిన వాళ్ళే రేవంత్‌లా మాట్లాడతారు అని విమర్శించారు.

రేవంత్ భాషను మంత్రివర్గంలో ఉన్న ఉత్తమ్, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ లాంటి మేధావులు ఎందుకు అడ్డుకోవడం లేదు. రేవంత్‌కు కేసీఆర్‌తో ఏమైనా గెట్ల పంచాయతీ ఉందా.. అట్లా మాట్లాడటానికి? కేసీఆర్ ఓ ఉద్యమ వట వృక్షం. రేవంత్ తులసీ వనంలో గంజాయి మొక్కలా మారారు అని ధ్వజమెత్తారు.

రేవంత్ ఓ దోపిడి దొంగలా మారారు.. రేవంత్‌లో అసహనం పతాక స్థాయికి చేరింది. కేసీఆర్‌తో రేవంత్ అభివృద్ధిలో పోటీపడాలి. రేవంత్‌కు దమ్ముంటే తలసరి ఆదాయం పెంచు.. స్థూల జాతీయోత్పత్తి పెంచు. రేవంత్ ఫ్రస్టేషన్ స్టార్, పరేషాన్ రెడ్డి. కేటీఆర్, హరీష్ రావుల ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతున్నావ్. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నీ పరిస్థితి ఏమిటి రేవంత్ రెడ్డి అని అడిగారు.

రేవంత్ పదవి ప్రమాదంలో పడింది.. అందుకే ఈ అసహనం. మహారాష్ట్ర ఫలితాల తర్వాత రేవంత్ సీఎం పదవి ఊడటం ఖాయం. కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రేవంత్ అదానీతో కలిసి పోయాడు. పుండుకు సమరు లేదు కానీ మీసాలకు సంపంగె నూనె సామెత రేవంత్ విషయంలో సరిగా సరిపోతుంది అని ఎద్దేవా చేశారు.

మహిళలకు పెన్షన్లు పెంచలేనోడు తులం బంగారం ఇవ్వలేనోడు. కోటి మందిని కోటీశ్వరులను చేస్తాడట. అదానీ, అంబానీలతో చేత కానిది రేవంత్‌తో అవుతుందట. పెళ్లికి చావుకు రేవంత్ ఒకటే మంత్రం చదువుతున్నాడు. సోనియా కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటా అంటున్నాడు.. అవును నీలాంటి చిచోరాగానికి సీఎం పదవి ఇచ్చినందుకు సోనియా తీర్థం తాగినా తప్పు లేదు. తొక్కుడు కాదు ఇచ్చిన హామీలు అమలు చేయి రేవంత్ రెడ్డి.. చేతకాకపోతే గద్దె దిగు రేవంత్ రెడ్డి అని దాసోజు శ్రవణ్ దుయ్యబట్టారు

రేవంత్‌కు దమ్ముంటే బెల్ట్ షాపులు బంద్ చేయి.. ఫోటోకు పాలాభిషేకం చేస్తా. కేసీఆర్ దూషణల మీద పెట్టే శ్రద్ధ.. పాలన మీద పెట్టు రేవంత్ అని సూచించారు.