
యాదాద్రి భువనగిరి, జూన్ 17: తెలంగాణలో అమలు చేస్తున్న దళిత బంధు అద్భుతమని పంజాబ్ మంత్రి, అధికారులు కొనియాడారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రి డాక్టర్ బల్జిత్ కౌర్, సంబంధిత అధికారులు సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిని శనివారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా దళిత బంధు లబ్ధిదారులతో మంత్రి మాట్లాడారు. దళిత బంధు ఏర్పాటుకు ముందు, ప్రస్తుతం లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకుని, దళిత బంధు పథకం అధ్యయనం చేసేందుకు ఇక్కడికి వచ్చామని ఈ పథకాన్ని పంజాబ్ లో ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న దళిత బంధు అద్భుతమని పొగిడారు.