mt_logo

కేటీఆర్‌ను ఎలాగైనా లోపలెయ్యాలి.. బయటుంటే కాంగ్రెస్ పని ఖతం.. మల్లగుల్లాలు పడుతున్న రేవంత్?

టార్గెట్ కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సంవత్సరం సమయమిద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తూ.. మౌనంగా ఉండటంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మొత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి.

ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాలనపై తనదైన ముద్ర వేసిన కేటీఆర్, ఇప్పుడు అంతే సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్రను నిర్వర్తిస్తూ.. అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాడుతూ.. ప్రజల గొంతుకగా నిలుస్తున్నాడు.

ఈ 11 నెలల్లో రేవంత్ సర్కార్ అసమర్థతను ఎత్తిచూపడంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో, కుంభకోణాలు, అక్రమాలు బయటపెట్టడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో పడింది. ఏదో ఒక కేసులో ఇరికించి కేటీఆర్‌ను ఎలాగైనా లోపలెయ్యాలి.. బయటుంటే మాత్రం కాంగ్రెస్ పని ఖతమవుతుందనే అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ ఒచ్చినట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది.

అధికారంలో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇప్పటికే కాంగ్రెస్ సోషల్ మీడియా కేటీఆర్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. దానికి తోడు.. ఫోన్ ట్యాపింగ్ అని, ఫార్ములా-ఈ అని ఇలా ఏదో ఒక దాంట్లో కేటీఆర్‌ని ఎలాగైనా ఇరికించాలని రేవంత్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా అసలు కేటీఆర్‌కి ఏ మాత్రం ప్రమేయం లేని లగచర్ల కేసులోకి కూడా కేటీఆర్‌ని లాగుదామని మల్లగుల్లాలు పడుతుంది.

గత 11 నెలలుగా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగినప్పుడల్లా ఏదో ఒక అటెన్షన్ డైవర్షన్‌తో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీపై ఎప్పటికప్పుడు కేటీఆర్ ఎదురుదాడి చేశారు. వాళ్ళ ప్రయత్నాలన్ని విఫలమవ్వడంతో ఇప్పుడు కేటీఆర్‌ని ఎలాగైనా జైలులో వేసి ప్రజల గొంతుకను నొక్కేయాలని చూస్తున్నారు. కేసు మీద కేసు వేసి కొన్ని నెలల పాటు కేటీఆర్‌ను జైల్లో ఉంచాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం.

రైతులు, హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు.. ఇలా అని వర్గాల పీడిత ప్రజలకు అండగా నిలుస్తూ.. అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కేటీఆర్‌ను జైల్లో వేసి పైశాచిక ఆనందం పొందుదామని రేవంత్ అనుకుంటున్నాడని టాక్ నడుస్తుంది.

అయితే.. కేటీఆర్ అరెస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినట్టు సమాచారం. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కేటీఆర్‌ను అరెస్టు చేస్తే మొదటికే మోసం వచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని ఒక వర్గం వాదన. డబ్బు సంచులతో అడ్డంగా దొరికి రేవంత్ జైలు పాలయ్యాడు కాబట్టి కేటీఆర్‌ని కూడా ఏదో ఒక విధంగా తప్పుడు కేసులోనైనా ఇరికించి జైల్లో వేయాలని రేవంత్ వర్గం పట్టు పట్టినట్లు వినికిడి.