mt_logo

కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ వైఖరి

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం ముఖ్యనేతలతో కలిసి తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశమై పలువిషయాలు చర్చించారు. విలీనం కావాలని కోరుతూనే నలుగురు టీఆర్ఎస్ పార్టీ సభ్యులను కాంగ్రెస్ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారని, నోరు తెరిచి మాట్లాడకుండానే విలీన చర్చలు జరిగాయని అంటున్నారని కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనంపై అసలు చర్చలు మొదలవకుండానే దిగ్విజయ్ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని మీడియాతో చెప్పడాన్ని వారు తప్పుబట్టారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసి 2014 లో ఇచ్చింది. రాష్ట్రం ఇస్తే విలీనం చేస్తామని తాము రెండేళ్ళ క్రితం చెప్పామని, అప్పుడే ఏమీ తేల్చకుండా ఇప్పుడు విలీనం ప్రసక్తి తెరపైకి తేవడం భావ్యం కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇస్తామని వాగ్ధానం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకొరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, టీఆర్ఎస్ విలీనాన్ని ఎందుకు అడుగుతున్నారని అంటున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటామని, ఎన్నో పథకాలు కూడా ప్రకటించిందని, ఇప్పుడు మాట తప్పితే ప్రజలముందు దోషులుగా తలెత్తుకోలేమని టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రజాదరణ మరే పార్టీకీ లేనందున ఒంటరిగానే ఎన్నికల్లోకి వెళ్లాలని, మార్చి 1 న జరిగే పూర్తిస్థాయి టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో తుది నిర్ణయం తెలుసుకోనున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ టీడీపీ నేతలు అనేకమంది టీఆర్ఎస్ పార్టీలో చేరాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ నేతలు చేరగా, రంగారెడ్డి జిల్లా నేతలు కే.కే.మహేందర్ రెడ్డి, కే.ఎస్.రత్నం, ఎమ్మెల్సీ నరేందర్ శుక్రవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో చేరనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *