mt_logo

బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎంపీటీసీ

-గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి

పర్వతగిరి, ఆగస్టు 14 : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం, గొల్లపల్లి, మన్ పహాడ్, గ్రామాలకు చెందిన ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్ హుస్సేన్, కామారెడ్డి గూడెం కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పులిపంపుల భాస్కర్, యువజన నాయకుడు మహమ్మద్ మేహరు తదితరులు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి,  బీఆర్ఎస్  పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా పర్వతగిరి లో మంత్రి వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్  పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..  పార్టీలో వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు పార్టీ అభివృద్ధికి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కృషి చేయాలని వారికి సూచించారు. కాగా, బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎంపీటీసీ జకీర్ మాట్లాడుతూ మంత్రి వర్యులు చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్నాను. నన్ను నమ్ముకొని ఎంపీటీసీ గా గెలిపించిన తన కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంత్రి గారి సహకారంతో అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు.