రేవంత్ రెడ్డి ఉప్పల్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. కార్పొరేటర్ రజిత పరమేశ్వర రెడ్డి వర్గీయులు కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి పోస్టర్‌ను చించేసారు. ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. స్థానిక కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి ఫోటో లేదని.. మళ్ళీ ప్లెక్సీ కడుతున్న రాగిడి లక్ష్మారెడ్డి అనుచరులపై దాడికి దిగారు పరమేశ్వర్ రెడ్డి అనుచరులు.