- మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం – మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
- మహేందర్ రెడ్డి సమక్షంలో భారీగా బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు

వికారాబాద్ : కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలో గోకఫసల్వాద్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీలో పాల్గొని, పార్టీ జెండా ఎగరవేశారు. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో పెద్ద ఫసల్ వాద, అంతారం, చిన్న ఫసల్ వాద గ్రామాల నుండి చాకలి అంతప్ప, విజయ్, ప్రమీల, దండు షామ్, కొవ్వూరు బీము, మహేష్, జుట్టు జనార్ధన్ తదితరులతో కలిసి భారీ సంఖ్యలో బీఆర్ఎస్‌లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేరారు. గులాబీ కంటూ కప్పి స్వాగతం పలికిన మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మీకు మాటలు కావాలా చేతలు కావాలా మాటలు చెప్పే పోయే వారి మాటలు నమ్మకండని సూచించారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు అవుతున్నాయా? అని అడిగారు. ఢిల్లీ కెళ్ళి వచ్చిన కాంగ్రెస్ దూతలు అవి, ఇవి ఇస్తాం అని ప్రజలను మభ్యపెడుతున్నారు. ముందు కర్ణాటకలో ఇచ్చి తెలంగాణలో ఇవ్వాలని అన్నారు.
కొడంగల్ అభివృద్ధికి నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వందల కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి పరుస్తున్నారని స్పష్టం చేసారు. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలో రైతుబంధు లేదు, 24 గంటల కరెంటు లేదు, బీసీ దళిత బంధు లేవు. కాంగ్రెస్ నాయకులు అక్కడ కర్ణాటకలో తెలంగాణ పథకాలను ఇచ్చి మాట్లాడితే బాగుంటదన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వమని పేర్కొన్నారు.